ఎన్టీఆర్ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్‌

ఎన్టీఆర్ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్‌

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న  ఆర్ ఆర్ ఆర్  సినిమా కోసం సినీ ప్రేమికులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి జక్కన సినిమా తెరకెక్కించడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి భీమ్ ఫర్ రామరాజు , రామరాజు ఫర్  భీమ్ పేర్లతో రెండు టీజర్లను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ రెండు టీజర్లు సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.  ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ టీజర్ తాజాగా మరో రికార్డు ను తిరగరాసింది. టాలీవుడ్ లో మొదటి ఒక మిలియన్ లైక్స్ సాధించిన టీజర్ గా..లక్ష కామెంట్లు పొందిన మొదటి టీజర్ గా ఇది నిలిచింది. ఇక వేగంగా 30 మిలియన్ల వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్ గా రికార్డు సృష్టించింది. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.