హైదరాబాద్ లో దారుణం: చెల్లిని బెదిరించి అక్కపై అత్యాచారం 

హైదరాబాద్ లో దారుణం: చెల్లిని బెదిరించి అక్కపై అత్యాచారం 

దిశపై అత్యాచారం, హత్య తరువాత హైదరాబాద్ లో కొంతవరకు అత్యాచారాలు తగ్గిపోతాయని అనుకున్నారు.  తగ్గకపోగా ఒకింత ఎక్కువయ్యాయని చెప్పాలి.  నగరంలో ఎక్కడో ఒకచోట అత్యాచారం జరుగుతూనే ఉన్నది.  వీటిని తగ్గించేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా.. తగ్గుముఖం పట్టడం లేదు.  దిశ ఘటన మరవక ముందే నగరంలో మరో ఘోరం జరిగింది.  

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగింది.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగుకి వచ్చింది.  ఈనెల 8 వ తేదీన సాయంత్రం సమయంలో ఆటోడ్రైవర్ మహ్మద్ అనే వ్యక్తి చాంద్రాయణగుట్ట వద్ద ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఆటో ఎక్కించుకున్నాడు. అనంతరం వారిని ఇంటికి తీసుకెళ్లాడు.  కాగా, ఆటో డ్రైవర్ మహ్మద్ సోదరుడు మూసా ఆ ఇద్దరినీ తీసుకొని ఓ లాడ్జీకి తీసుకెళ్లి బెదిరింది అక్కపై అత్యాచారం చేశారు.  అనంతరం ఆ ఇద్దరిని వదిలేసి వెళ్లిపోయారు.  కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ మహ్మద్, అతని తమ్ముడు మూసాను అరెస్ట్ చేశారు.