ఖిలాడి కొత్త పోస్టర్ రిలీజ్..

ఖిలాడి కొత్త పోస్టర్ రిలీజ్..

మాస్ మహరాజ్ రవితేజ తాజాగా క్రాక్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తన విజయాత్ర కొనసాగిస్తుందడగానే రవితేజ తన తదుపరి చిత్రం నుంచి సరికొత్త అప్‌డేట్ తీసుకొచ్చాడు. రవితేజ నూతనంగా చేస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే దీని నుంచి నేడు మరో పోస్టర్ విడుదలైంది. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగుతోంది. ఈ సినిమా రమేష్ వర్మ దర్వకత్వంలో తెరకెక్కతోంది. ఇందులో మాస్ మహరాజ్ సరసన మీనాక్షి చౌదరీ నటిస్తోంది. దీనిని రమేష్ వర్మ యాక్షన్ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఖలాడీ టీం సరికొత్త పోస్టర్ విడుదల చేసింది. ఇందులో రవితేజ, మీనాక్షి, డింపుల్ హయాతి ముగ్గురు కనిపించారు. ఈ చిత్రం ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోంది. ఇందులో రవితేజ లుక్స్ ఎలా ఉంటాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల వచ్చిన రవితేజ క్రాక్ సినిమా బారీ హిట్ కావడంతో రవితేజ తదుపరి చిత్రం ఖాలాడీ పై కూడా అంచనాలు తారాస్థాయిని మించిపోయాయి. మరి ఈ సినిమాతో మరోసారి రవితేజ అభమానులను ఆకట్టుకుంటుందేమో వేచి చూడాలి.