తెలంగాణలో మరో కొత్త కరోనా కేసు...

తెలంగాణలో మరో కొత్త కరోనా కేసు...

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది.  ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విస్తరించిన ఈ వైరస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదు కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.  విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు ఈటెల పేర్కొన్నారు.  

దుబాయ్, యూరోపియన్ దేశాలు, ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్లకు కరోనా వచ్చిందని, వారికీ చికిత్స అందిస్తున్నామని అన్నారు.  కరోనా విషయంలో ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కరోనా అప్డేట్ గురించి ఇకపై రోజుకు మూడుసార్లు బులిటెన్ రిలీజ్ చేస్తామని ఈటెల పేర్కొన్నారు.  కరోనా వైరస్ కారణంగా దేశంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.