బాలయ్య ఆగిపోయిన మరో సినిమాకూడా రానుందా .?

బాలయ్య ఆగిపోయిన మరో సినిమాకూడా రానుందా .?

నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో బోయపాటి శీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు.అయితే ఇటీవల బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన నర్తన శాల సినిమా ప్రేక్షకులముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 'నర్తనశాల' సినిమా మధ్యలో ఆగిపోయింది. బాలయ్య అర్జునిడిగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు.ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. దాంతో సినిమాను పక్కన పెట్టేసాడు బాలకృష్ణ. అయితే ఈసినిమా 17 నిముషాలు చిత్రీకరించారు. అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పడు బాలకృష్ణ నటించిన మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'విక్రమ సింహ భూపతి' అనే సినిమాను మొదలు పెట్టారు. సినిమా దాదాపు సగం షూట్ పూర్తి అయిన తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూల కారణంగా సినిమాను ఆపేశారు. ఇప్పుడు ఈ సినిమాను షూటింగ్ పూర్తయిన అంతవరకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట.