అంతరిక్షంలో అద్భుతం.. 1850వ సంవత్సరం తర్వాత ఇప్పుడే..!

అంతరిక్షంలో అద్భుతం.. 1850వ సంవత్సరం తర్వాత ఇప్పుడే..!

సౌర కుటుంబంలోని ఆరు ముఖ్యమైన గ్రహాలు... తమ అత్యుత్తమ స్థానానికి చేరుకోబోతున్నాయి. సెప్టెంబర్ 13... సాధారణంగా చూస్తే క్యాలెండర్‌లో ఇదొక రోజు. కానీ... ఖగోళ శాస్త్రవేత్తలు, జ్యోతిష్య పండితుల దృష్టిలో ఇదొక అద్భుతమైన రోజు. ఎందుకంటే... నేడు స్వక్షేత్ర షష్టి గ్రహ కూటమి ఏర్పడింది. అంటే... ఆరు గ్రహాలు తమ సొంత రాశుల్లోకి రాబోతున్నాయి. రాహు, కేతు, శుక్రగ్రహాలు మినహా మిగిలిన ఆరు గ్రహాలు తమ తమ ఇళ్లల్లో ఉండబోతున్నాయి. ఇది అత్యంత అరుదైన, అద్భుతమైన ఆస్ట్రోలాజికల్ కాంబినేషన్‌ అంటున్నారు జ్యోతిష్య పండితులు. చంద్రుడు స్వక్షేత్రంలోకి వచ్చిన్పుడు సూర్యుడు స్వక్షేత్రంలోకి రావడం ఓ విశేషం. అదే సమయంలో బుదుడు, కుజుడు, గురువు, శని స్వక్షేత్రంలో ఏ కాలంలో ఉంటున్నాయి. 1850 ఇది సంభవించింది. మళ్లీ 2022 జులై 2న సంభవించబోతోంది. తిరిగి 2 వేల 257లో ఇటువంటి షడ్గ్రహ యోగం సంభవించబోతోంది. 

ఇవాళ్టితో పాటు రేపు, ఎల్లుండి కూడా స్వక్షేత్ర షడ్గ్రహ కూటమి సంభవించనుంది. సూర్యుడు సింహ రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో, కుజుడు మేష రాశిలో, బుధుడు కన్యా రాశిలో, గురువు ధనస్సు రాశిలో, శని మకర రాశిలో ఉంటాయి. అంటే, తొమ్మిది గ్రహాల్లో ఆరు స్వక్షేత్రాల్లో ఉండబోవడం అంటే చాలా ఆరుదుగా ఏర్పడే గ్రహ స్థితి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. స్వక్షేత్రం అంటే సొంత ఇల్లు. గ్రహాలు తమ సొంత ఇంట్లో ఉన్నప్పుడు అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయంటున్నారు జ్యోతిష్య పండితులు. అందువల్లే ఇప్పుడు ఏర్పడుతున్నది అరుదైన గ్రహస్థితి అంటున్నారు. ఉదయం 11 గంటల 32 నిమిషాల నుంచి పన్నెండున్నర గంటల మధ్య కాలంలో విశేష గ్రహ స్థితి ఏర్పడింది. ఆ సమయంలో దీపారాధన, పూజలు, దేవతా విధులు విశేష ఫలితాన్నిస్తాయంటున్నారు పండితులు. సాధారణంగా రెండు గ్రహాలు ఒక రాశిలో ఉండటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు అవి విశేష ఫలితాలు ఇస్తాయని మన పూర్వీకులు చెప్పారు. ప్రస్తుతం అటువంటి అరుదైన గ్రహస్థితి ఏర్పడుతుండడం వల్ల... ఆ సమయంలో చేసే పూజా కార్యక్రమాలకు విశేషమైన ఫలితం ఉంటుందంటున్నారు పండితులు.