విజయవాడలో దారుణం: ప్రేమించలేదని యువతిని కాల్చిచంపిన యువకుడు

విజయవాడలో దారుణం: ప్రేమించలేదని యువతిని కాల్చిచంపిన యువకుడు

దేశంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి.  ఎన్ని చట్టాలు అమలు తీసుకొచ్చినా, మార్పు రావడం లేదు.  పైగా, చట్టాల్లో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకొని కొంతమంది తప్పించుకుంటున్నారు.  ఇదిలా ఉంటే, విజయవాడలో మరో దారుణం జరిగింది.  విజయవాడలోని విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి, విజయవాడలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నది.  హాస్పిటల్ కు సమీపంలో ఓ రూమ్ అద్దెకు తీసుకొని స్నేహితులతో కలిసి ఉంటోంది.  అయితే, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతానికి చెందిన నాగభూషణం అనే యువకుడు చిన్నారిని వేదించడం మొదలుపెట్టాడు.  ప్రేమించాలని వెంటపడ్డాడు.  అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు.  పోలీస్ లకు ఫిర్యాదు చేసింది.  ఎప్పుడు వేదించదను అని చెప్పడంతో కేసు వాపసు తీసుకుంది.  అయితే, సోమవారం రాత్రి సమయంలో విధులు ముగించుకొని వస్తున్న చిన్నారిని అడ్డగించి వాదనకు దిగాడు.  పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.  దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది.  ఆ మంటలు యువకుడికి కూడా అంటుకోవడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.  ప్రస్తుతం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.