హీరోగా మరో డాన్సర్.. ఎవరంటే..

హీరోగా మరో డాన్సర్.. ఎవరంటే..

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు కూడా ఒకడు. సినీ పరిశ్రమకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు, దర్శకులను పరిచయం చేశాడు. అయితే ఇప్పుడు మరో హీరోను పరిచయం చేసేందుకు సిద్దమవుతున్నారు. డాన్స్ మాస్టర్ యశ్‌ను హీరోగా పరిచయం చేయడానికి దిల్‌రాజు సన్నాహాలు మొదలుపెట్టారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలో రానుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే డాన్స్ మాస్టర్ జానీ కూడా హీరోగా సినిమా చేస్తున్నాడు. తెలుగు చిత్ర సీమలో గతేడాది బంపర్ హిట్‌ అయిన అలా వైకుంఠపురములోతో పాటుగా ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో బుట్టబొమ్మ పాటకు జానీనే కొరియోగ్రాఫర్. అటువంటిది ఇప్పుడు జానీ మాస్టర్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. అదే విధంగా డాన్స్‌మాస్టర్ యశ్ కూడా హీరోగా మారనున్నాడు. దీనికి దిల్ రాజు ప్రణాళిక సిద్దం చేశాడట. అయితే ఇప్పటికే దిల్‌రాజు నిర్మెస్తున్న వకీల్‌సాబ్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్‌లు చేస్తున్న ఎఫ్3 చిత్రీకరణలో ఉంది. ఈక్రమంలో దిల్‌రాజు నిర్మిస్తున్న మరో మూడు సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం వకీల్‌సాబ్ తరువాత దిల్‌రాజు చిన్న సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు. ఈ క్రమంలోనే డాన్సర్ యశ్‌ను హీరోగా చేయనున్నారట.