బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత కంగనా రనౌత్ ఒక పక్క మొత్తం బాలీవుడ్ ఒక పక్క అన్నట్టు మారిపోయింది. కంగన మహారాష్ట్రలో అడుగు పెట్టవద్దంటూ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఈ విషయం సంచలనంగా మారింది. శివసేన నేతలకు దీటుగా కంగన సైతం కామెంట్లు చేసింది.  తాజాగా కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ముంబై పోలీసులు శివసేన సర్కార్ ఫెయిల్ అయ్యిందని కంగనా రౌనత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది . ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పోల్చింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దీనిపై ముంబై కోర్టును ఆశ్రయించారు. వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు కంగనాపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే కంగనా సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది.