అబ్దుల్ కలామ్ సోదరుడి మృతికి అనిల్ సుంకర సంతాపం!

అబ్దుల్ కలామ్ సోదరుడి మృతికి అనిల్ సుంకర సంతాపం!

భారత మాజీ రాష్ట్రపతి, ప్రపంచం గర్వించే శాస్త్రవేత్త, స్వర్గీయ అబ్దుల్ కలామ్ సోదరుడు ఎపిజె మహ్మద్ ముత్తు మీరా మృతి పట్ల ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ జాతిలో స్ఫూర్తి నింపిన అబ్దుల్ కలామ్ కు ఆయన సోదరుడే అసలైన స్ఫూర్తి ప్రదాత అని అనిల్ సుంకర తెలిపారు. తాను అభిషేక్ అగర్వాల్ తో కలిసి నిర్మించబోతున్న అబ్దుల్ కలామ్ బయోపిక్ కు ముత్తు మీరా విలువైన సమాచారం అందించారని చెప్పిన అనిల్ సుంకర, కలామ్ సోదరుడి మృతికి సంతాపం తెలిపారు.