ఎఫ్3లో మూడో హీరోపై క్లారిటీ ఇచ్చిన అనిల్

ఎఫ్3లో మూడో హీరోపై క్లారిటీ ఇచ్చిన అనిల్

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఎఫ్3. ఈ సినిమా అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే గత కొంతకాలంగా ఈ ఎఫ్3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరో కూడా చేయనున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మూడో స్టార్ హీరోగా రవితేజ చేయనున్నాడని, మహేష్, సాయి ధరమ్ తేజ్ ఇలా మరికొందరి పేర్లు కూడా వినిపించాయి. ఈ వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. దాంతో దర్శకుడు అనిల్ రావిపుడి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ ఆసినిమాతోనే స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత అనిల్ చేస్తున్న సినిమా ఎఫ్3. ఈ సినిమాలో మూడో స్టార్ హీరోగా ఎవరూ చేయడం లేదని, అసలు మూడో హీరో అన్న ఆలోచన కూడా తనకు లేదని అనిల్ తేల్చి చెప్పాడు. అంతేకాకుండా ఎఫ్2ను ఇద్దరితోనే ముగించానని అలాగే ఎఫ్3ని కూడా వారితోనే ముగాస్తానని తెలిపాడు. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాస్తున్నాడు. ఎఫ్2ను కూడా దిల్ రాజే నిర్మాంచాడు. ఇందులో కూడా ఎఫ్2 మాదిరిగానే తమన్నా, మెహ్రిన్‌లూ కనిపించనున్నారు. కానీ ఎఫ్3లో వచ్చే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. దాంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో అనిల్ అభిమానులకు ఏరేంజ్ ఫన్ అందిస్తాడో వేచి చూడాలి.