భార్యకు కరోనా వచ్చిందని... వాహనాలకు నిప్పు పెట్టాడు...!!
కరోనా వైరస్ వస్తే ఎవరైనా సరే హాస్పిటల్ కు వెళ్లి చూపించుకుంటారు. ఇంట్లో ఎవరికైనా వస్తే హాస్పిటల్ కు వెళ్లి చూపిస్తారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం భార్యకు కరోనా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహనాలకు నిప్పు పెట్టాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...
లంగర్ హౌస్ లోని ప్రశాంత్ నగర్ లో నివసించే ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమెను హాస్పిటల్ లో చేర్చారు. వైద్యం అందిస్తున్నారు. భార్యకు కరోనా సోకడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె భర్త, తన స్నేహితుడితో కలిసి బాపూనగర్ వెళ్లి అక్కడ మద్యం తాగాడు. మద్యం సేవించిన సదరు వ్యక్తి ఆ మద్యం మత్తులో రెండు ద్విచక్రవాహనాలపై, ఒక ఆటోకు నిప్పుపెట్టారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)