ఏపీ కరోనా అప్డేట్...

ఏపీ కరోనా అప్డేట్...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,09,002 కు చేరింది.  ఇందులో 8,91,048 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 10,710కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఐదుగురు మరణించారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,244 కి చేరింది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 911 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.