ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే...?

ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే...?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,558 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,15,832 కు చేరింది. ఇందులో 8,93,651 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,913 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,268 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 915 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 31,268 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.