మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్‌...

మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్‌...

ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు జగన్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వచ్చే సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొన్న మహిళలకు.. 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 8న సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొని.. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే రూ 10 శాతం ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఏపీలో మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. మహిళల కోసం కోసం ఇప్పటికే అమ్మిఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టిన జగన్‌ ప్రభుత్వం.. మరో కోత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. అలాగే నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు.