మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... 

మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... 

రాష్ట్రంలో వివిధ కేసుల్లో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు ఏపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  యావజ్జీవ అనుభవిస్తున్న మహిళా ఖైదీలను ముందుగా విడుదల చేయాలని నిర్ణయిన్చచింది.  రాష్ట్రంలో మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  రాజమండ్రి మహిళా జైలు నుంచి 19 మంది, కడప నుంచి 27 మంది, నెల్లూరు నుంచి 5 మంది, విశాఖపట్నం నుంచి ఇద్దర్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే, విడుదలకు కొన్ని షరతులను విధించింది ప్రభుత్వం.  విడుదల కాబోయే మహిళా ఖైదీలు రూ.50వేలు పూచికత్తు బాండ్ ఇవ్వాలని ఆదేశించింది.  శిక్షాకాలం పరిమితి ముగిసే వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశించింది.  అలానే బయటకు వెళ్లిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి ముందస్తు విడుదలను రద్దు చేస్తామని హెచ్చరించింది.