బందరు పోర్ట్‌ డీపీఆర్‌కు ఆమోదం.. ఉత్తర్వులు జారీ

బందరు పోర్ట్‌ డీపీఆర్‌కు ఆమోదం.. ఉత్తర్వులు జారీ

బందరు పోర్ట్‌ డీపీఆర్‌కు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పోర్టు అభివృద్ధికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది... రూ. 5,835 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది... పోర్టు నిర్మాణం కోసం ఇంకా సేకరించాల్సిన 225 ఎకరాల నిమిత్తం రూ. 90 కోట్లు కేటాయించింది ఆంధ్రప్రదేశ్‌ సర్కార్.. ఏపీ మారీ టైమ్ బోర్డు ద్వారా టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చింది... బందరు పోర్ట్‌ అభివృద్ధి నిమిత్తం రూ. 1000 కోట్ల మేర నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది... ఇక, రూ. 4745 కోట్ల నిధులను రుణం రూపంలో సమీకరించుకునేందుకు ఏపీ మారీ టైమ్ బోర్డుకు అనుమతి ఇచ్చింది సర్కార్. కాగా, ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలోనూ బందరు పోర్టుకు సంబంధించిన కొత్త డీపీఆర్‌కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.