చిత్ర పరిశ్రమకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం...

చిత్ర పరిశ్రమకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం...

ఏపీలో సినిమా, టీవీ షూటింగ్ ప్రక్రియను సులభం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమా టివి, మరియు థియేటర్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేసింది. గతంలో సంస్థ ఎండి ఇచ్చిన సూచనల మేరకు 2006లో ఇచ్చిన జీవో కు సవరణలు చేసింది ప్రభుత్వం. నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు  సినీ, మరియ టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్ అనుమతులు ఇచ్చింది. అయితే గతంలో  నిర్ణయించిన ఫీజుల కాషన్ డిపాజిట్లను కార్పొరేషన్ కు చెల్లించిన తరువాత షూటింగ్ ముగిసిన అనంతరం వాటిని రీఫండ్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం.

అయితే ఆ సంస్థ ఎండి సూచనల మేరకు రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో షూటింగ్ కు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆ ప్రాంతాల్లో షూటింగ్స్  కోసం చెలించాల్సిన కాషన్ డిపాజిట్ల ఆధారంగా వాటిని 3 కేటగిరిలుగా విడదీసింది. అయితే మొదటి కేటగిరిలో పట్టణాభివృద్ధి సంస్థ పార్కులు,మునిసిపల్ కార్పొరేషన్ అధీనంలో ఉన్న పార్కులు రాష్ట్రంలోని వివిధ మ్యూజియం,బిల్డింగ్ లు,పాఠశాలలు మరియు కాలేజీలలో షూటింగ్ కు అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ షూటింగ్ కోసం రోజుకి  కాషన్ డిపాజిట్ 15వేలు చెలించాల్సి ఉంటుంది. ఇక రెండవ కేటగిరిలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులు,ఎపిటిడిసి ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు,మరియు ఉద్యానవనాలు,జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలు,కాలేజి లు,విజయవాడలోని స్టేట్ సెంట్రల్  లైబ్రరీలలో షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది . ఇక ఇక్కడ షూటింగ్ కోసం రోజుకి  కాషన్ డిపాజిట్ 10వేలు చెలించాల్సి ఉంటుంది. చివరగా మూడవ కేటగిరిలో మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు ,బీచ్ లు,అలిపిరి గార్డెన్స్ తో సహా, అన్ని పార్కుల్లో అలాగే ఏపీటిడిసి,ఆర్&బి, ఇరిగేషన్ శాఖల లొకేషన్స్ లో  షూటింగ్  కు అనుమతి ఇచ్చింది. అయితే ఈ స్థలాల్లో షూటింగ్ కోసం రోజుకి  కాషన్ డిపాజిట్ 5వేలు చెలించాల్సి ఉంటుంది.