రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సీఎస్ లేఖ...
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ ఎన్నికలకు సంబంధించిన రగడ ఓ కొలిక్కి వచ్చింది. సుప్రీం కోర్ట్ తీర్పుతో ఎన్నికలకు సహకరించే విషయంపై కొద్దిసేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తరువాత ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాథ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. కరోనా తగ్గిన తరువాత ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం కాగా ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. రాష్ట్ర హైకోర్టుతో పాటుగా సుప్రీమ్ కోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)