ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... పార్లమెంట్ సమావేశాలు జరిగే అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ద్వారా కేంద్ర ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మరోసారి ప్రజల ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ఎత్తుగడగా ఉందంటున్నారు. ఈ సారి సుమారు 18 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... సింగపూర్ పర్యటన నుండి తిరిగి రాగానే అసెంబ్లీ ఎప్పటి నుంచి నిర్వహించాలి అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేంద్రం, బీజేపీపై నిప్పులు చెరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం... ఈ సారి అసెంబ్లీ వేదికగా సెంటర్‌ను టార్గెట్ చేయాలని భావిస్తోంది.