యాంకర్ వ‌ర్షిణి.. సీక్రెట్‌ లవ్ ట్రాక్!

యాంకర్ వ‌ర్షిణి.. సీక్రెట్‌ లవ్ ట్రాక్!

యాంకర్ వ‌ర్షిణి నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై రాణిస్తుంది. ప్రస్తుతం పలు టీవీ షోలతో ఫుల్ బిజీగా వర్షిణి.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టింగ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ అభిమానులతో పంచుకుంటోంది. ఇక, ఈమధ్య అమ్మడు ట్రెడిషనల్, గ్లామర్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా వర్షిణి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలో వర్షిణి.. తను ఒకరి భుజంపై హాయిగా త‌ల‌వాల్చింది. అంతేకాకుండా తను వాలిన వ్యక్తి ఫోటోను కనిపించకుండా జాగ్రత్త పడింది. దీంతో ప్రతి ఒక్కరు అతను ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఇక కొందరు నెటిజన్లు వర్షిణి సీక్రెట్‌ లవ్ ట్రాక్ నడిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.