ఆ అభిమానిపై.. అనసూయ ఏమందంటే?

ఆ అభిమానిపై.. అనసూయ ఏమందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ ను వెండితెరపై చేసినందుకు అభిమానుల్లో పూనకాలు మొదలైయ్యాయి. వకీల్ సాబ్ విడుదలైన అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర చాలా హంగామా చేశారు. కొందరు అయితే పాలాభిషేకాలు.. కొబ్బరికాయలు కొడుతూ.. పవన్ పోస్టర్లపై పూలదండలు వేశారు. మరికొందరు ఇంకాస్త హద్దులు దాటిపోయారు. వకీల్‌సాబ్‌ షో నడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి స్క్రీన్‌ వద్దకు చేరుకుని దానిపై రక్తంతో పవన్‌ పేరు రాశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే తాజాగా పవన్‌ అభిమాని ప్రవర్తనపై నటి యాంకర్ అనసూయ అసంతృప్తితో పాటుగా ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ‘అభిమానం చాటుకోవడానికి ఎన్నో దారులున్నాయి. కొంచెం బాధ్యతాయుతంగా నడుచుకుంటే అందరికీ బాగుంటుంది. ఇలాంటి చర్యలను ఎదుటివాళ్లు ఎలా చూస్తూ ఊరుకున్నారు. ఇలాంటి పనుల వల్ల మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించారా?’ అంటూ అనసూయ ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ఈ క్రమంలోనే ఆ వీడియోను అనసూయ షేర్‌ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by memer mawa (@sarada_fun_man)