మౌంట్ కిలిమంజారోను అధిరోహించిన అనంత చిన్నారి.. కలెక్టర్ ప్రశంసలు !

మౌంట్ కిలిమంజారోను అధిరోహించిన అనంత చిన్నారి.. కలెక్టర్ ప్రశంసలు !

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం రాష్ట్రానికే కాక దేశానికి గర్వకారణమని, శభాష్ అంటూ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన చిన్నారి రిత్విక శ్రీని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రత్యేకంగా అభినందించారు.  నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆఫ్రికాలో ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన రిత్విక శ్రీ తన తండ్రి కడపల శంకర్, బీసీ వెల్ఫేర్ డీడీ యుగంధర్, మానవ రక్తదాతల సంస్థ కన్వీనర్ తరిమెల అమర్నాథ్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ని కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాడిమర్రి మండలం, ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన 9 ఏళ్ల 7 నెలల వయసున్న చిన్నారి రిత్విక శ్రీ ఆఫ్రికాలో ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం రాష్ట్రస్థాయిలోనే గర్వకారణమన్నారు. చిన్న వయసులోనే కిలిమంజారో పర్వతంను అధిరోహించడం చాలా సంతోషకరమని, చిన్నారి మరిన్ని పర్వతాలను అధిరోహించాలని, భవిష్యత్తులో చిన్నారి పర్వతారోహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు.