హైదరాబాద్ డాక్టర్ ను రక్షించిన అనంతపురం పోలీసులు... 

హైదరాబాద్ డాక్టర్ ను రక్షించిన అనంతపురం పోలీసులు... 

హైదరాబాద్ లో నిన్న సాయంత్రం డెంటిస్ట్ డాక్టర్ హుస్సేన్ ను అయన కారులోనే దుండగులు కిడ్నాప్ చేశారు.  రాజేందర్ నగర్ పరిధిలోని  ఎక్సైజ్ కాలనీలో డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.  అయితే, దుండగులు కిడ్నాపర్లను అనంతపురం జిల్లా మీదుగా బెంగళూరు తీసుకెళ్తున్నారని సమాచారం అందటంతో, అనంతపురం జిల్లాలోని అన్ని చెక్ పోస్ట్ లను అక్కడి ఎస్పీ సత్యయేసుబాబు అలర్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో అక్కడి పోలీసులు కిడ్నపర్ల చెర నుంచి డెంటిస్ట్ డాక్టర్ హుస్సేన్ ను రక్షించారు. పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు కిడ్నాపర్లు పారిపోయారు.  పరారైన ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.