అనంతపురంలో మిడతలు... ఆందోళనలో రైతులు... 

అనంతపురంలో మిడతలు... ఆందోళనలో రైతులు... 

దేశం ఇప్పుడు కనిపించని శతృవు కరోనాతో ఫైట్ చేస్తున్నది.  ఈ శత్రువును ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచనలో ఉండగా, ఇప్పుడు మరో శత్రువు దేశం మీద దాడి చేస్తున్నది.  రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఆఫ్రికా ఖండం నుంచి సముద్రాలు దాటి పాకిస్తాన్ మీదుగా ఇండియాలోకి ప్రవేశించిన  దేశంలోని పంటలను నాశనం చేస్తున్నాయ్.  మిలియన్ల సంఖ్యలో ఒకేసారి పంటపొలాలపై వాలిపోయి పంటను మాయం చేస్తున్నాయి.  

దీనిని ఎదుర్కొనడానికి రైతులు పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు.  ఎటు నుంచి దండు వచ్చిపడుతుందో అని ఆందోళన చెందుతున్నారు.  అన్ని రకాలుగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే, ప్రస్తుతం మహారాష్ట్ర వరకు వ్యాపించింది.  అక్కడి నుంచి తెలంగాణకు వచ్చే అవకాశం ఉన్నది.  దీంతో తెలుగురాష్ట్రాల అప్రమత్తం అయ్యాయి.  అయితే, హఠాత్తుగా వేలసంఖ్యలో మిడతలు అనంతపురం జిల్లాలో దర్శనం ఇవ్వడంతో రైతులు షాక్ అయ్యారు.  అనంతపురం జిల్లా రాయదుర్గం మండంలోని దానప్పరోడ్డులో మిడతలు ఓ మిడతల దండు కనిపించింది. 

జిల్లేడు చెట్లపై వందల సంఖ్యలో వాలి ఉన్న ముడతలను చూసి రైతులు, అధికారులు షాక్ అయ్యారు.  ఈ మిడతలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయేమో అని భయపడుతున్నారు.  మహారాష్ట్ర వరకు వచ్చిన ఈ మిడతలు తెలంగాణలో వ్యాపిస్తాయని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో కనిపించడంతో అధికారులు వీటిపై ఆరా తీస్తున్నారు.