మహారాష్ట్ర యువరైతు వినూత్న ఆలోచన...వైరల్ అవుతున్న వీడియో... 

మహారాష్ట్ర యువరైతు వినూత్న ఆలోచన...వైరల్ అవుతున్న వీడియో... 

ఇండియాలో టాలెంట్ కు కొదవలేదు.  చదువుకున్న వ్యక్తులు మాత్రమే కొత్త కొత్త వస్తువులను రూపొందిస్తారు అనుకుంటే పొరపాటే.  చదువు లేకపోయినా, చేయాలనే తపన ఉంటె ఏదైనా  సాధించవచ్చు అని ఇప్పటికే ఎందరో నిరూపొంచారు.  మహారాష్ట్రకు చెందిన ఓ యువరైతు ట్రాక్టర్ సహాయంతో పాలు పితికే సాధనం కనిపెట్టాడు.  

మాములుగా పాలు పితికే సాధనం మార్కెట్లో ధర అధికంగా ఉంటుంది.  దీంతో సొంతంగా ఆలోచన చేసిన ఈ యువరైతు అందుబాటులో ఉన్న వస్తువులు, నాబ్ ల సహాయంతో పాలు పితికే సాధనాన్ని రూపొందించారు.  దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా స్పందించాడు.  ఇండియాలోని గ్రామాల్లో ట్రాక్టర్ ను మల్టీ టాస్కింగ్ కోసం వినియోగిస్తున్నారని అన్నారు. ఇంజనీరింగ్ కానీ వారు ఇలా చేయగలరా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.