అరంగేట్ర ఆటగాళ్లకు కార్లను బహుమతిగా ప్రకటించిన ఆనంద్ మహీంద్రా...

అరంగేట్ర ఆటగాళ్లకు కార్లను బహుమతిగా ప్రకటించిన ఆనంద్ మహీంద్రా...

ఆసీస్ తో జరిగిన సుదీర్ఘ పర్యటనలో టెస్ట్ సిరీస్ సమయంలో మాత్రమే భారత ముఖ్య ఆటగాళ్లు చాలా మంది గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. ఆ కారణంగానే ఈ సిరీస్ లో చాలా మంది యువ ఆటగాళ్లు తమ టెస్ట్ అరంగేట్రం చేసారు. మహమ్మద్  సిరాజ్, సైని, శుబ్‌మాన్‌ గిల్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసి రాణించగా గతంలో తన మొదటి మ్యాచ్ లోనే గాయపడిన శార్దూల్ ఠాకూర్ కు కూడా ఈ సిరీస్ లో ఆద్భుతమైన ప్రదర్శన చేసాడు. దాంతో వీరందరికి మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్రా తన కంపెనీ నుండి ఖరీదైన 'THAR SUV' కార్ లను బహుమతిగా ప్రకటించాడు. వారు తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు ఆయన. దాంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.