"రౌడీ బాయ్స్"గా దిల్ రాజు మేనల్లుడి టాలీవుడ్ ఎంట్రీ

"రౌడీ బాయ్స్"గా దిల్ రాజు మేనల్లుడి టాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. అయితే ఇప్పుడు దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆశిష్ హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి 'రౌడీ బాయ్స్'  అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఆశిష్ సరసన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో 'హుషారు' వంటి యూత్ ఫుల్ చిత్రాన్ని రూపొందించిన హర్ష కొనుగంటి దర్శకత్వం వహించనున్న 'రౌడీ బాయ్స్'కు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు 'రౌడీ బాయ్స్'ను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరోవైపు ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన భారీ చిత్రం 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.