అసైన్డ్ ల్యాండ్స్ కబ్జాపై కలెక్టర్ కీలక నివేదిక... ఈటల రాజీనామా చేస్తారా? 

అసైన్డ్ ల్యాండ్స్ కబ్జాపై కలెక్టర్ కీలక నివేదిక... ఈటల రాజీనామా చేస్తారా? 

తెలంగాణలో మంత్రి ఈటల రాజేందర్ పై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు వచ్చాయి.  ఈ ఆరోపణలపై కలెక్టర్ నివేదికను కూడా సమర్పించారు.  ఈటల రాజేందర్ భూములను కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. జమున హేచరీస్ ఆధీనంలో భూములు ఉన్నట్టు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు.  హాకింపేట, అచ్చంపేట గ్రామాల్లో భూములు కబ్జా జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.  మొత్తం 20 మంది బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు.  బెదిరించి భూములను బాధితుల నుంచి లాక్కున్నట్టు, అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో చెట్లను తొలగించినట్లు, అనుమతి లేకుండా జమున హేచరీస్ లో పౌల్ట్రీ షెడ్డులను నిర్మించినట్లు నివేదికలో పేర్కొన్నారు.  ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ విత్ డ్రా చేసుకున్నారు.  ప్రస్తుతం ఎలాంటి పోర్ట్ పోలియో లేని మంత్రిగా ఉన్నారు ఈటల రాజేందర్.  భూములు కబ్జా చేసినట్టుగా స్పష్టమైన నివేదికలు ఉండటంతో ఆయన రాజీనామా చేస్తారా లేదా అన్నది చూడాలి.