అంబటి: సొంత పార్టీ నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు....

అంబటి: సొంత పార్టీ నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు....

సొంత పార్టీ నేతలు ఇచ్చిన షాక్‌తో కంగుతిన్న ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి భరోసా లభించింది? లెట్స్‌ వాచ్‌!

సీఎం జగన్‌ దృష్టికి అంబటి రాంబాబు వివాదం!

అంతా అయిపోయిందని అనుకున్నారు. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఇక పని అయిపోయినట్టేనని భావించారు. కానీ అనూహ్యంగా  అధినేత నుంచే అభయం రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారట గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారని వైసీపీకి చెందిన నాయకులే రాంబాబుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం అధికార పార్టీలో కలకలం రేపింది. హాట్ హాట్‌ చర్చ జరిగింది. ఈ వివాదం సీఎం జగన్‌ దృష్టికి కూడా వెళ్లింది. ఏకంగా అధినేత దగ్గరకే వెళ్లడంతో రాంబాబు ఫ్యూచర్‌ ఏంటనే చర్చ అధికారపార్టీలో జరిగింది. 

సీఎం తెప్పించుకున్న రిపోర్ట్‌లో అంబటి పాత్ర లేదని తేలిందా?

ఈ అంశంపై అంబటి వర్గం అప్రమత్తమైంది. ప్రత్యర్థులకు కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధమైనా వేచి చూసే ధోరణి అవలంభించింది. ఎమ్మెల్యే అంబటిపై ఆరోపణలు రావడం.. పైగా సొంత పార్టీ నేతలే పిటిషన్‌ వేశారని తెలియడంతో వాస్తవం ఏంటనేదానిపై ముఖ్యమంత్రి రిపోర్ట్‌ తెప్పించుకున్నారట. ఈ సందర్భంగా  అక్రమ మైనింగ్‌లో అంబటి పాత్ర లేదని.. ఆరోపణలు నిజం కాదని సీఎం  తెలుసుకున్నారని చెబుతున్నారు. అంతకాదు.. అంబటికి సీఎం జగన్‌ మద్దతుగా నిలిచారని టాక్‌. 

అంబటిపై ఆరోపణలు చేసినవాళ్లు మనోళ్లు ఎలా అవుతారని సీఎం ప్రశ్న!

ఈ వివాదం ముఖ్యమంత్రి దగ్గరకు చేరడం వల్లే అంబటి సైలెంట్‌ అయ్యారట. అక్కడి నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే తదుపరి యాక్షన్‌ ప్లాన్‌ నిర్ణయిద్దామని అనుకున్నారట.  ఇక్కడ మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఫిర్యాదుదారులు మన పార్టీ వాళ్లే అని సీఎం జగన్‌ దృష్టికి పక్కనున్నవాళ్లు చెప్పారట. అయితే అంబటన్న మీద నిరాధార ఆరోపణలు చేస్తే వాళ్లు మనవాళ్లు ఎలా అవుతారు అని ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం. నాయకుడు తన మీద ఇంత నమ్మకం ఉంచడంతో.. అంబటి రెట్టించిన ఉత్సాహంతో కౌంటర్‌ అటాక్‌కు దిగారట. తన పరువును రోడ్డున వేసినవారిపై పరువు నష్టం దావా వేసే పనిలో పడ్డారట. 

అక్రమ లైమ్‌స్టోన్‌ తవ్వకాలు చేస్తున్నారని అంబటిపై పిటిషన్‌!

సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం కొటనెమలిపురి, కుబ్బాద్పురం గ్రామాల మధ్య ప్రభుత్వానికి చెందిన భూముల్లో అంబటి రాంబాబు ఆయన అనుచరులు అక్రమంగా లైమ్ స్టోన్ తవ్వకాలు పాల్పడుతున్నారని హైకోర్టులో వేసిన పిటిషన్‌లో ప్రస్తావించారు. రాజుపాలేనికి చెందిన పుప్పుల శ్రీనివాసరెడ్డి, కొండమోడుకు చెందిన నల్లగొర్ల రామయ్యలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఈ నెల ఏడో తేదీన హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. వీరిద్దరూ తమని తాము వైసీపీ కార్యకర్తలుగా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇందులో రాజకీయ కోణం ఉందని హైకోర్టు అనుమానం వ్యక్తం చేయడంతో.. రాజకీయం కోణం ఉంటే తాము వైసీపీ కార్యకర్తలుగా  చెప్పుకొనేవారం కాదని బదులిచ్చారు. ఇప్పుడీ సమస్య అనూహ్య మలుపులు తీసుకోవడంతో ప్రత్యర్థులపై అంబటి యాక్షన్‌ ప్లాన్‌ ఏంటన్న చర్చ మొదలైంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.