జగన్ లో బుల్లెట్ లేకపోతేనే.. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడా?

జగన్ లో బుల్లెట్ లేకపోతేనే.. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడా?

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.  జగన్ వల్లే చంద్రబాబు కుప్పం గల్లీలు పట్టుకుని తిరుగుతున్నాడని.. జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి చంద్రబాబుకు వచ్చిందని ఎద్దేవా చేశారు.  14  ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు నీళ్లు ఇమ్మని జగన్ ను అడుగుతున్నారని తెలిపారు.  టీడీపీ కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలని అడుగుతున్నారని.. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప కుప్పంలో ప్రచారానికి టీడీపీకి దిక్కు లేదని పేర్కొన్నారు.  అధికారంలో ఉండి కూడా మ్యానిఫెస్టో అమలు చేయలేకపోయిన చంద్రబాబు... ప్రతిపక్షంలో ఈ కొత్త మ్యానిఫెస్టో ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు. లోకేష్ వచ్చిన తర్వాతే సైకిల్ తునాతునకలు అయిందని.. జగన్మోహన్ రెడ్డి గన్ లో బుల్లెట్ లేకపోతేనే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడా? అని పేర్కొన్నారు. గన్ లో బుల్లెట్ లేకపోతేనే టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయ్యిందా? తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆక్రోశం లోకేష్ లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.  భువనేశ్వరి అయినా కొడుకు మానసిక స్థితిని జాగ్రత్తగా చూసుకోవాలని... లోకేష్ మానసిక స్థితి బాగోలేదన్నారు.