కొండ మీద స్నేహాం.. కొండ కింద పోరాటం

కొండ మీద స్నేహాం.. కొండ కింద పోరాటం

జగన్ పాదయాత్రలో చేసే వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రతిరోజు మంత్రులతో తిట్టిస్తున్నారని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర రేపటికి రెండు వేల కిలోమీటర్ల పూర్తికానున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అహంకారంతో అందిస్తున్నారని.. ఆయనకు అంతరాత్మ లేదని.. అబద్ధాలు అనంతంగా చెబుతుంటారని ఆరోపించారు. బాబుకు పోరాటం అంటే ఏమిటో తెలియదని... కొండ మీద స్నేహం.. కొండ కింద పోరాటం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. పరిపాలనను గాలికి వదిలేశారని.. సీఎంఆర్ సర్వేలో రెండవ అవినీతి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని.. టీడీపీని ఓడించి భూస్థాపితం చేయడం చారిత్రక వాస్తవమని వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 14, 15 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు పాదయాత్రలు నిర్వహిస్తాయని అంబటి తెలిపారు.