నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్ష ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్ష ఉద్యోగాలు..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కరోనావైరస్‌.. వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావం పడింది.. ఇక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తీవ్రస్థాయిలో దెబ్బ కొట్టింది... లక్షలాది ఉద్యోగాలు ఉడిపోతే.. కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారు. అయితే, ఇదే సమయంలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. కరోనా దెబ్బకు బయటకు వెళ్లి షాపింగ్ చేయడం బాగా తగ్గిపోగా.. ఇదే సమయంలో.. ఆన్‌లైన్ సేవలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇక, కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నా.. దానితో సహజీవనం తప్పదని ప్రభుత్వాధినేతలే ప్రకటించారు. మరోవైపు.. ఉద్యోగాల భర్తీకి ఆయా సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.. ఇదే సమయంలో.. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లక్ష కొత్త ఉద్యోగుల నియామకాన్ని ప్రకటించింది. తాత్కాలిక, శాశ్వత స్థానాల్లో కొత్త నియామకాలు ఉంటాయని పేర్కొంది. ఈ ఉద్యోగాలు.. ఆర్డర్ల ప్యాకింగ్, డెలివరీ లేదా సార్టింగ్ విభాగాలు ఉండనున్నాయి. 

మరోవైపు.. కరోనాతో అన్ని రంగాలు కుదేలైతే.. ఆన్‌లైన్ వ్యాపారం బాగానే సాగుతోంది.. ఏప్రిల్, జూన్ నెలల్లో అమెజాన్‌ రికార్డు స్థాయిలో లాభాలు, ఆదాయాలు నమోదు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు కిరాణా, ఇతర వస్తువులను ఆన్‌లైన్‌లో కొనడానికి ఇష్టపడుతున్నారు. దీంతో.. ఈ ఏడాది 1,75,000 మందిని నియమించుకునే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్టు ఇప్పటికే అమెజాన్ నిర్ణయం తీసుకుంది. గత వారం కంపెనీకి 33,000 కార్పొరేట్, టెక్నాలజీ ఉద్యోగాలు ఉన్నాయని, ఈ నియామకాలు చేపట్టాల్సి ఉందని చెప్పింది. తమ 100 కొత్త గిడ్డంగులు, ప్యాకేజీ సార్టింగ్ కేంద్రాలు, ఇతర ప్రదేశాలలో ఇప్పుడు కొత్త ఉద్యోగులు అవసరమని కంపెనీ పేర్కొంది. మొత్తానికి ఇతర రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయినవారికి, నిరుద్యోగులకు అమెజాన్‌ గుడ్‌న్యూస్ చెప్పినట్టు అయ్యింది.