కరోనా అడ్డేకాదు..! లాభాల్లో దూసుకెళ్తోంది..

కరోనా అడ్డేకాదు..! లాభాల్లో దూసుకెళ్తోంది..

కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతోంది.. ఉద్యోగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు.. ఉపాధి కూడా దెబ్బతినడంతో.. ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తోంది... అయితే.. ఈ సమయంలోనూ కొందరికి లాభాలపంట పండుతోంది.. ఆన్‌లైన్‌ రిటైలర్‌ అమెజాన్‌ లాభాల్లో దూసుకుపోయింది. క్యూ3లో బ్లాక్‌బస్టర్‌ లాభాలను నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షల ఉన్నా ఆన్‌లైన్‌ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 37శాతం పెరిగాయి. దీంతో మహమ్మారి కాలంలోనూ భారీగా లాభపడిన టెక్‌ దిగ్గజాల్లో ఒకటిగా అమెజాన్ నిలిచింది. క్లౌడ్ డివిజన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా, కరోనా సమయంలో.. బయటకు వెళ్లి షాపింగ్ చేసేవారి సంఖ్య తగ్గి.. అంతా.. ఆన్‌లైన్‌ మార్కెట్‌ వైపు మొగ్గుచూపుతోన్న సంగతి తెలిసిందే.. ఇక, పండుగ సీజన్‌లో మరిన్ని ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి ఆన్‌లైన్‌ రిటైల్ దిగ్గజాలు.