గుడ్‌న్యూస్ చెప్పిన అమెజాన్‌ .. 50 వేల మందికి ఉద్యోగాలు..

గుడ్‌న్యూస్ చెప్పిన అమెజాన్‌ .. 50 వేల మందికి ఉద్యోగాలు..

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో లక్షల్లో నిరుద్యోగులు అయ్యారు.. చిన్నచిన్న కంపెనీలు మొదలు బడా సంస్థలు కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి.. మరికొన్ని సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టి సరిపెట్టారు.. అయితే.. ఇదే సమయంలో ఆన్‌లైన్ రీటైలర్‌ అమెజాన్‌ మాత్రం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్‌ సమయంలో బుకింగ్స్ నిలిపివేయడం.. ఒకవేళ బుక్ చేసుకున్నా.. అవి డెలివరీ చేయాల్సి ఉండడంతో.. అమెజాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తానికి తమకు 50 వేల సిబ్బంది అసవరం ఉందంటూ అమెజాన్ ఇండియా ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50 వేల మంది  సిబ్బందిని నియమిస్తామని తెలిపింది. కొత్తగా తీసుకునే సిబ్బందిని.. అమెజాన్‌ ఫ్లెక్స్‌లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్  ఉద్యోగాల కింది తీసుకోనున్నట్టు ప్రకటించింది అమెజాన్.. దేశంలోని అన్ని అమెజాన్‌ కేంద్రాలు,  డెలివరీ నెట్‌వర్క్‌లో ఈ అవకాశాలుంటాయని పేర్కొంది. మొత్తానికి లాక్‌డౌన్‌లో నిరాశ్రయులైన వారిలో వేలాది మందికి ఇది గుడ్‌న్యూస్‌గానే చెప్పాలి.