ఎయిర్‌టెల్‌ - అమెజాన్‌ భారీ డీల్..!

ఎయిర్‌టెల్‌ - అమెజాన్‌ భారీ డీల్..!

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చూపు ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్‌పై పడింది.. ! ఎయిర్‌టెల్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది... 5 శాతం వాటా అయినా అది మామూలు డీల్‌ అని మాత్రం తీసివేయడానికి లేదు.. ఎందుకంటే.. ఆ 5 శాతం డీల్‌ విలువ రూ.15,000 కోట్లుకు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇక, దీనిపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.. కానీ, అటు అమెజాన్‌ కానీ, ఇటు ఎయిర్‌టెల్‌ గానీ.. ఈ డీల్ విషయంపై మాట్లాడేందేకు నిరాకరిస్తున్నాయి. అయితే, ఈ డీల్‌ కుదిరితే మాత్రం.. ఎయిర్‌టెల్‌కే బాగా కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు.. భారత్‌లో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌కు 30 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.. ఒక్కప్పుడు దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న ఈ టెలికం సంస్థ.. రిలయన్స్‌ జియో ఎంట్రీ ఎఫెక్ట్‌తో ఎదురుదెబ్బలు చవిచూడాల్సి వచ్చింది.. దీంతో.. క్రమంగా మార్కెట్‌ వాటాను కోల్పోయి మూడోస్థానానికి పడిపోయింది. 

మరోవైపు.. రిలయన్స్ జియో ఈ మధ్య విదేశీ పెట్టుబడులను ఆహ్వానించింది.. ఇప్పటికే ఫేస్‌బుక్‌ సహా పలు అంతర్జాతీయ కంపెనీల ఇన్వె స్ట్‌మెంట్లతో మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది.. ఇలాంటి సమయంలో నిలదొక్కుకోవాలంటే.. ఎయిర్‌టెల్‌కు అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీల పెట్టుబడుల ఎంతమైనా అవసరమనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా.. అమెరికన్‌ టెక్‌ దిగ్గజ కంపెనీలు ఇప్పుడు భారత్‌ టెలికం సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందేకు ఆసక్తి చూపుతున్నాయి. మరోవైపు.. ఎయిర్‌టెల్-అమెజాన్‌ డీల్ ఊహాగానాలు.. నిన్న మార్కెట్‌లో ఎయిర్‌టెల్‌కు బాగా కలిసి వచ్చింది.. ఎయిర్‌టెల్‌ షేరు ధర 3.89 శాతం ఎగబాకి రూ.573.15కు చేరుకుంది. ఇక, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ బోర్డు ఈ నెల 11న సమావేశం కానుంది.. ఈ సమావేశం తర్వాత.. ఈ డీల్‌పై కొంత క్లారిటీ వచ్చే అవకావం ఉంంటున్నారు.