మజ్జిగతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు...

మజ్జిగతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు...

మజ్జిగ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.  ఎండాకాలం వస్తే చల్లదనం కోసం మజ్జిగ తీసుకుంటూ ఉంటారు.  ఒక్క ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లో మజ్జిగను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.  మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటే అది శరీరానికి ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది. మజ్జిగ శరీరాన్ని కూల్ చేయడమే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.  దానితో పాటుగా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది.  మజ్జిగ లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది.  ఇది ఇతర పాల ఉత్పత్తుల కంటే చాలా సులువుగా జీర్ణం అవుతుంది.  మజ్జిగ గ్యాస్, అజీర్తి వంటి వ్యాధుల నుంచి బయటపడేలా చేస్తుంది.  అంతేకాదు, మజ్జిగలో క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి  ఉంటాయి.  ఎముకలు పటిష్టంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పతాయి.