క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం..!

 క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం..!

ఎంపీ నవనీత్ కౌర్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు 12 మందికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో నవనీత్ కౌర్ మరియు ఆమె కుటుంబ సభ్యులు ముంబై లోని అమరావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించినట్టుగా తెలుస్తోంది. దాంతో ఆమెను నాగపూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మొదట నవనీత్ కౌర్ భర్త ఎమ్మెల్యే రవి కరోనా బారిన పడ్డారు. దాంతో వారి కుటుంబం మొత్తం పరీక్షలు చేయించుకున్నారు. కాగా వారిలో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తమకు కరోనా వచ్చిన విషయాన్ని నవనీత్ కౌర్ తో పాటు ఆమె భర్త తెలిపారు. తమను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.