అమరావతికే నా మద్దతు : కేంద్రమంత్రి 

అమరావతికే నా మద్దతు : కేంద్రమంత్రి 

వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చి పెద్ద దుమారమే లేపింది. అయితే...మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, విపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాయి. ఏదిఏమైనా వైసీపీ ప్రభుత్వం తన మూడు రాజధానుల ప్రతిపాదనకు అడ్డంకులు తొలగించుకుంది. కానీ అమరావతి రైతులు మాత్రం దీనిపై మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ రాజధానిపై  కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికే తన మద్దతు అని అథవాలే తెలిపారు. అమరావతి రైతులు, మహిళా జేఏసీ నేతలు ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రాజధాని విషయంలో రైతుల డిమాండ్‌ న్యాయమైందని...పేదలు, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారని అథవాలే పేర్కొన్నారు. చారిత్రక ప్రాంతమైన అమరావతికే తన మద్దతు ఉంటుందని..రాజధాని అంశంపై సీఎం జగన్‌కు లేఖ రాస్తానని భరోసా ఇచ్చారు.