చంద్రబాబు పై ఆమంచి సంచలన వ్యాఖ్యలు
జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి దాడి గురించి చంద్రబాబు రాసిన లేఖపై వైసీపీ నేత ఆమంచి స్పందించారు. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారాయన. ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని చంద్రబాబు దోచుకున్నారాని విమర్శించారు వైసీపీ నేత. టీడీపీ హయాంలో జరిగిన హత్యలు, దౌర్జన్యాన్ని గుర్తుచేసుకోమని చంద్రబాబుకు సూచించారాయన. చంద్రబాబు చచ్చిన పాముని.. జగన్ పాలన చూసి బెంబేలెత్తిపోతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు కృష్ణమోహన్. మరోవైపు నాగార్జున రెడ్డి అసలు జర్నలిస్ట్ కాదని అతను టీడీపీ ఎన్నికల ఏజెంట్ అని ఆరోపించారు ఆమంచి.
అతనిపై 17 కేసులున్నాయని ఎమ్మెల్యే కరణం బలరాంకి అనుచరుడని తెలిపారాయన. సూడో నక్సల్ పేరుతో నాగార్జున వసూళ్లకు పాల్పడేవాడని ప్రజాప్రతినిధులపై నీచమైన పోస్టింగ్స్ పెట్టేవాడని మండిపడ్డారు కృష్ణమోహన్. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం చంద్రబాబు వ్యక్తిత్వానికి నిదర్శమని ఆమంచి కృష్ణమోహన్ ఫైరయ్యారు. నాడు ఆంధ్రప్రభ రిపోర్టర్ హత్య కేసులో మాజీ మంత్రి పుల్లారావుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ నీతి, నిజాయతీ ముందు చంద్రబాబు సరిపోరని, ప్రతి విషయాన్ని సీఎం జగన్ కు ఆపాదించడం మంచిది కాదని, అక్రమంగా ఉంటున్న చంద్రబాబు ఇంటిని ఎప్పుడు కూలుస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)