చీరాల వైసీపీలో ముసలం.. కరణం మీద ఆమంచి ఫిర్యాదు !

చీరాల వైసీపీలో ముసలం.. కరణం మీద ఆమంచి ఫిర్యాదు !

కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీతలపై ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్‌చార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు. వైఎస్ వర్థింతి కార్యక్రమంలో తనపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇద్దరిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆమంచి. టీడీపీని గాని, చంద్రబాబుని కానీ బలరామ్, ఆయన కొడుకు వెంకటేష్ ఒక్క మాట కూడా అనడం లేదని ఆరోపిస్తున్నారు ఆమంచి. సొంత సామాజికవర్గం మెప్పు కోసం తప్పితే, జగన్‌పై పార్టీపై అభిమానం లేదని విమర్శించారు. సొంత పార్టీవాడిన తనపై విమర్శలు చేయడం దారుణమంటున్నారు ఆమంచి కృష్ణమోహన్.

నిన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కరణం వెంకటేష్ ఆమంచికి ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చాడు. చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ఆరోజు ప్రమాణం చేశామని, చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చేందుకే మేము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గతంలో మాదిరిగా ఇక్కడ అరాచకాలు, బెదిరింపులు సాగవని, బెదిరింపులను ఎవరూ చూస్తూ కుర్చోరు జాగ్రత్త అని హెచ్చరించారు. వైసీపీలో చాలా సంతోషంగా ఉందన్న ఆయన నియోజకవర్గ అభివృద్ది కోసమే అందరం కలసి వైసీపీ లోకి వచ్చాము, బాలినేని శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి చీరాలను అభివృద్ది చేసుకుందామని అన్నారు.