హైకోర్టు తీర్పు పై మాజీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు...!

హైకోర్టు తీర్పు పై మాజీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు...!

 డాక్టర్ సుధాకర్ కేసు హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని కోరారు. చిన్నచిన్న కేసులు సీబీఐ ద్వారా విచారణ జరపడం సరికాదని అన్నారు. సుధాకర్ కేసు విచారణ జరపడానికి రాష్ట్రంలో ఒక్క నిజాయితీ గల అధికారి కూడా హైకోర్టుకి కనిపించ లేదా అని ఆమంచి ప్రశ్నించారు. ప్రతి విషయానికీ సీబీఐ విచారణ జరిపితే రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ ఉన్న ప్రతి చోటా సీబీఐ ఆఫీసు పెట్టాల్సి వస్తుందని  వ్యాఖ్యానించారు.