ఆ విషయంలో నాకు ఎవరు సహాయం చేయలేదు: అమలా పాల్

ఆ విషయంలో నాకు ఎవరు సహాయం చేయలేదు: అమలా పాల్

దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్‌లలో అమలా పాల్ కూడా ఒకరు. అమలా పాల్ వైవిధ్యమైన కథలతో పాటు తన అందంతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఆమె గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్‌ను వివాహం చేసుకుననారు. కానీ పెళ్లి అయిన కొన్ని నెలలకే వారి మధ్య విభేదాలు వచ్చాయి. వాటి కారణంగా వారు విడాకులు తీసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్ తన విడాకుల విషయం పై కూడా మాట్లాడారు. ‘నా డివోర్స్‌ సమయంలో నాకు ఎవరూ మద్దతుగా నిలువలేదు. నేనే అతడితో ఉండలేనని, విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు చాలా మంది ఫోన్ చేసిన నాకు ఇక కెరీర్ ఉండదని, ఒక్క అవకాశం కూడా రాదని అన్నారు. ఆ పరిస్థితుల్లో నా గురించి, నా మానసిక పరిస్థితి గురించి కానీ ఎవరూ పట్టించుకోలేద’ని అమలాపాల్ చెప్పారు. ఇదిలా ఉంటే అమలాపాల్ తెలుగులో నాయక్ సినిమాలో నటించారు. ఆ తరువాత తాజాగా వచ్చిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ పెట్టకథలులో మీరా ఎపిసోడ్‌లో అనుమానాస్పద భర్త కారణంగా బాధపడే భార్య పాత్రలో చేశారు.