కిస్ సీన్లకు.. నో కండీషన్స్ అంటున్న అమలాపాల్

కిస్ సీన్లకు.. నో కండీషన్స్ అంటున్న అమలాపాల్

మ‌ల‌యాళ భామ అమ‌లాపాల్‌ ‘పిట్ట‌క‌థ‌లు’ సినిమాతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ బ్యూటీ న‌టించిన పాత్ర‌కు మంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో తాను డేరింగ్ రోల్స్ లో న‌టించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని హామీ కూడా ఇస్తున్న‌ట్టు ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. ద‌క్షిణాది రాధికాఆప్టేగా పేరు తెచ్చుకోవాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న అమ‌లాపాల్‌కు ఫిల్మ్ మేక‌ర్స్ ఆఫ‌ర్స్ ఇస్తారా అన్న‌ది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. ప్రస్తుతం ఈ భామ  లిప్ టు లిప్ కిస్ సీన్ల‌కు కూడా ప‌చ్చ‌జెండా ఊపింద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ‘పిట్ట‌క‌థ‌లు’ సినిమాలో బోల్డ్ గా నటించిన ఈ భామ ఇక ముందు ఎలాంటి సీన్స్ కైనా.. నో కండీషన్స్ చెప్పేసిందని కోలీవుడ్ లో వినిపిస్తున్న మాట. అంతేకాదు గ్లోబ‌ల్ ఆడియెన్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు క‌నెక్ట్ అయ్యేలా మ‌రిన్ని వెబ్ డ్రామాలు, ఓటీటీ షోలు చేయాల‌నుకుంటుంద‌ట అమ‌లాపాల్‌.