అమలాపాల్ మాజీ లవర్‌కి ఝలక్ ఇచ్చిన కోర్టు!

అమలాపాల్ మాజీ లవర్‌కి ఝలక్ ఇచ్చిన కోర్టు!

అమలాపాల్‌లో మద్రాస్‌ హైకోర్టు ఊరట కల్పించింది. అమలాపాల్‌ కొద్ది రోజులుగా బాలీవుడ్‌ గాయకుడు భవీందర్‌సింగ్‌తో ఈ భామ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య ప్రియుడితో కలిసి ఓ వెడ్డింగ్‌ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఆ ఫోటోలను భవీందర్‌ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి... వెంటనే తొలగించాడు. దీంతో వీరిద్దరికి పెళ్లయిపోయిందనే వార్తలు హల్‌ చల్‌ చేసాయి. అయితే.. ఓ కమర్శియల్‌ యాడ్‌లో భాగంగా వారిద్దరు వధూవరుల మాదిరిగా మారి ఫొటో షూట్‌ చేశారు. ఆ ఎపిసోడ్‌ తర్వాత.. కొన్ని కారణాల వల్ల అతడితో బ్రేకప్‌ చేసేసుకుంది అమలపాల్‌. అయితే... అమలాపాల్‌ పర్సనల్‌ ఫోటోలను భవ్‌నిందర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుండటంతో... ఆగ్రహించిన ఆమె.. అతనిపై పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపించిన మద్రాస్‌ హైకోర్టు అమలాపాల్‌ కు సంబంధించి ఎలాంటి పోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయరాదని వార్నింగ్‌ ఇచ్చింది కోర్టు. దీనిపై భవ్‌నిందర్‌ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసును వచ్చే నెల 22కు వాయిదా వేసింది హై కోర్టు తీర్పునిచ్చింది.