మలింగ స్థానంలో ముంబై జట్టులోకి వచ్చిన బౌలర్ ఎవరో తెలుసా...?

మలింగ స్థానంలో ముంబై జట్టులోకి వచ్చిన బౌలర్ ఎవరో తెలుసా...?

ఐపీఎల్ 2020 మరి కొన్ని గంటలో ప్రారంభం కాబోతుంది. మార్చి నుండి ఈ లీగ్ కోసం ఎదురు చూస్తున్నఅభిమానులు ఈ కొన్ని గంటలు గడవడానికి చాలా ఆతృతగా వేచి ఉన్నారు. ఈ రోజు మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకముందే డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ముంబై జట్టుకు షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈ జట్టు స్టార్ ఆటగాడు పేసర్ లసిత్ మలింగ ఈ ఏడాది ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో ఆ జట్టు పేస్ బలం తగ్గింది. అయితే మలింగ స్థానంలో జట్టు ఎవరిని తీసుకుంది అనేది అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజాగా ముంబై ట్విట్టర్ లో విడుదల చేసిన వీడియోతో అందరికి తెలిసిపోయింది. గత ఏడాది ముంబై జట్టుకు ఆడిన యువ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసఫ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ పై 6/12 తో అదరగొట్టాడు. కానీ ఈ ఏడాది అతడిని ముంబై జట్టు విడిచిపెట్టిన వేలంలో ఎవరు తీసుకోలేదు. కానీ ఇప్పుడు  ముంబై విడుదల చేసిన వీడియోలో అల్జారీ జోసఫ్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దాంతో ఆ జట్టు మలింగ స్థానంలో అతడినే తీసుకున్నట్లు అర్ధం అవుతుంది.