కొత్త జిల్లాకు మన్నెం వీరుడిపేరు :ఏపీ మంత్రి

 కొత్త జిల్లాకు మన్నెం వీరుడిపేరు :ఏపీ మంత్రి

ఏపీలో ఏర్పడబోయే జిల్లాల్లో ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరును పెడతామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అల్లూరి 123వ జయంతి సంధర్భంగా ఆయన విశాఖ బీచ్‌ రోడ్డు వద్ద గల అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల్లో ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరును పెడతామని అన్నారు. అంతే కాకుండా సీతారామరాజు పుట్టిన విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పాండ్రంకి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వచ్చే సంవత్సరం అల్లూరి జయంతివరకు కేడీ పేటలో అల్లూరి సమాధి, పాండ్రంగిలో మ్యూజియం ను ఏర్పాటు చేస్తామన్నారు. దానికోసం రూ. 200 కేటాయించామని తెలిపారు. కాగా ఎన్నికల ప్రచారంలో సైతం జగన్ తాము గెలిస్తే ఒక జిల్లాకు సీతారామరాజు గారి పేరును పెడదామని అన్నారు. ఇదే విషయమై ఇటీవల ఎంపీ కృష్ణం రాజు కూడా  ముఖ్యమంత్రికి లేఖ రాసారు.