కొరటాల-బన్నీ: త్వరలోనే షూటింగ్ ప్రారంభం!

కొరటాల-బన్నీ: త్వరలోనే షూటింగ్ ప్రారంభం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రశ్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అడవుల నేపథ్యంలో తెరకెక్కితున్న కారణంగా ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ను అడవుల్లోనే చిత్రిస్తున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ కూడా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా వీరిద్దరి సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే అల్లు అర్జున్-కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతునట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలెట్టారట.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందట. కొద్దిరోజుల్లోనే కొరటాల-బన్నీ సినిమా అప్డేట్ రానుందని సమాచారం.