కూతురుకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అల్లు అర్జున్..

కూతురుకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అల్లు అర్జున్..

టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలతో పాటు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో... ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఇవాళ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో బన్నీ తన కూతురుకి అరుదైన గిఫ్ట్‌ ఇచ్చాడు. క్లాసిక్‌ మూవీ "అంజలి" సినిమాలోకి "అంజలి.. అంజలి " అనే పాటను రీ క్రియేట్‌ చేసి.. వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మణిరత్నం దర్శకత్వంలో మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహించిన "అంజలి " సినిమాలో బేబీ షామిలి తన అభినయంతో అందరినీ కట్టిపడేసిన సంగతి విదితమే. ఈ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ని ఇప్పుడు అల్లు అర్హతో మళ్లీ రీ క్రియేట్‌ చేయగా.. క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌తో అల్లు అర్హ నటించి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటతో అల్లు అర్హ తో పాటు ఆమె సోదరుడు అల్లు అయాన్‌, తాతయ్యలు అల్లు అరవింద్‌, కేసీ శేఖర్‌ రెడ్డి సహా బన్నీ కూడా నటించడం విశేషం. నాన్‌ క్లాసిక్‌ సాంగ్‌కు ధీటుగా ఈ పాటను కలర్‌ ఫుల్‌గా రీ క్రియేట్‌ చేశారు. గణేశ్‌ స్వామి కొరియోగ్రఫీ చేసిన లేటెస్ట్ అంజలి వీడియో సాంగ్‌కు సూర్య సినిమాటో గ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.