స్మగ్లర్ 'పుష్ప' రాజ్  లుక్ అదిరింది... 

స్మగ్లర్ 'పుష్ప' రాజ్  లుక్ అదిరింది... 

అల్లు అర్జున్ 20 వ సినిమా పుష్ప సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు.  ఉదయాన్నే అల్లు అర్జున్ ఫోటోను, సినిమా లోగోను రిలీజ్ చేశారు.  ఇందులో అల్లు అర్జున్ డి గ్లామర్ పాత్రలో కనిపిస్తున్నారు.  మాసిన గడ్డంతో ఎర్ర చందనం చక్కల స్మగ్లర్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయినప్పటికీ కరోనా వైరస్ తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ అయ్యింది.  

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది.  పోలీస్ స్టేషన్ లో బన్నీ ఎర్ర చందనం చక్కల పక్కన కూర్చొని ఉంటాడు.  వెనక ఇద్దరు పోలీసులు నిలబడి ఉంటారు.  ఈ ఫోటోను బట్టి ఇందులో బన్నీ రెడ్ శాండిల్ స్మగ్లర్ గా కనిపిస్తున్నట్టు అర్ధం అవుతున్నది.  రఫ్ అండ్ టఫ్ గా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్టయిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది.